: 101 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలో!


అమెరికాలోని ఫ్లోరిడాలో 101 ఏళ్ల వృద్ధుడు ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఫ్లోరిడాలో సారసోటా ప్రాంతానికి చెందిన 101 ఏళ్ల జోన్యూమెన్ అనే వ్యక్తి కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ పోల్స్ లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పాటుపడుతుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందని, అందుకే ఆ పార్టీ తరపున బరిలో నిలబడ్డానని వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉన్న జో తెలిపారు. మన బాధ్యతల గురించి జీవితం ఎన్నో పాఠాలు చెబుతుందని, వాటిని పూర్తి చేయకుండా అద్దంలో ముఖాన్ని ఎలా చూడగలమని జో ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News