: మేం అడిగిన సవరణలే బీజేపీ అడిగింది: జేపీ
లోక్ సత్తా పార్టీ ప్రతిపాదించిన సవరణలనే బీజేపీ ప్రతిపాదించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తాము ప్రతిపాదించిన సవరణల్లో మూడు మాత్రమే ఆమోదించారని ఆయన తెలిపారు. అవశేష ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.