: సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన ప్రధాని
సీమాంధ్ర అభ్యంతరాలను నివృత్తి చేస్తూ కాసేపట్లో ప్రకటన వెలువడనుందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలను ఊరడించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులతో ప్రధాని చర్చించారు. ఈ చర్చ సందర్భంగా సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై కాసేపట్లో సస్పెన్స్ వీడనుంది.