: మోగుతున్న క్యాన్సర్ ఘంటికలు.. తగ్గుముఖం పట్టిన ఎయిడ్స్


ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధంటే ప్రాణాంతకమే. ఇప్పుడు అత్యాధునిక చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాక కాస్తంత భరోసా చిక్కింది. కానీ, క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. ఏటికేడాది పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాజ్యసభకు తెలిపిన లిఖిత పూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 2011లో 28,19,457.. 2012లో 28,20,179.. 2013లో 29,34,314 కేసులు నమోదయినట్టు మంత్రి పేర్కొన్నారు. ఇక, అత్యంత ప్రమాదకర ఎయిడ్స్ వ్యాధి భారత్ లో తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ఎయిడ్స్ నియంత్రణ విభాగం గణాంకాల మేరకు 2010-11లో 3,17,336.. 2011-12లో 2,85,152.. 2012-13లో 2,45,859 కేసులను గుర్తించామని ఆజాద్ రాజ్యసభకు వివరించారు.

  • Loading...

More Telugu News