: వారిద్దరూ చిత్తూరు జిల్లా చీడపురుగులు: భూమన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పున్వర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందేందుకు మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరించారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాకు వారిద్దరూ చీడపురుగులని అన్నారు. 50 లక్షల మంది చిత్తూరు జిల్లా వాసులు తలదించుకునేలా వారిద్దరూ వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తెలుగు ప్రజలను వంచించి కిరణ్ కుమార్ రెడ్డి డబ్బులు దండుకునేందుకు పదవిలో చివరి వరకు కొనసాగారని విమర్శించారు. రెండు ప్రాంతాల నేతలతో డ్రామాలాడిన చంద్రబాబు నాయుడు విదూషకుడిలా మారిపోయారని భూమన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News