: సీఎం రమేశ్ నోట 'ముగ్గురు మహిళల' మాట
రాజ్యసభలో అలుపెరుగని పోరాటం చేస్తున్న టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టపగలే ముగ్గురు మహిళలు ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని మండిపడ్డారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, విపక్ష నేత సుష్మా స్వరాజ్ ముగ్గురూ రాష్ట్ర విభజన పాపంలో పాలుపంచుకున్నారని ఆరోపించారు. నిన్న లోక్ సభలో జరిగిన దారుణాన్ని ప్రపంచం మొత్తం గమనించిందని దుయ్యబట్టారు. తెలుగుజాతి ఆకాంక్షలను పట్టించుకోకుండా సోనియా, రాజకీయ లబ్ది కోసం సుష్మ, అధికార పక్షానికి వంతపాడి మీరా కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించాయని విమర్శించారు.