: సీమాంధ్ర మంత్రులకు, కురియన్ కు వాగ్వాదం
రాజ్యసభలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి, జేడీ శీలం సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటూ వారు నిలబడి నినాదాలు చేశారు. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని మంత్రులను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదేపదే కోరారు. అయినా వారు వినకపోవడంతో కురియన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు నిరసన వ్యక్తం చేయాలనుకుంటే మంత్రి పదవులకు రాజీనామా చేసి రావాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రులకు, కురియన్ కు వాగ్వాదం జరిగింది.