: రాజ్యసభను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనన్న బీజేపీ


రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. లైవ్ ప్రసారాలను ప్రసారం చేయని పక్షంలో ఇవాళ చర్చ జరగబోదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. ‘‘రాజ్యసభలో ఇవాళ (బుధవారం) తెలంగాణ బిల్లును ప్రభుత్వం చర్చకు తీసుకురానున్నది. ఈ నేపథ్యంలో, సభా కార్యకలాపాల లైవ్ టెలికాస్ట్ జరిగేలా చూడాలని కోరారు. లేని పక్షంలో చర్చ జరిగే ప్రసక్తి లేదు’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘మంగళవారం నాడు లోక్ సభ కార్యకలాపాల వీడియో, ఆడియో రికార్డులు కూడా లేవని కూడా మా దృష్టికి వచ్చింది. ఎందుకు రికార్డు చేయలేదని బీజేపీ ప్రశ్నిస్తోంది’’ అని రవిశంకర్ అన్నారు.

  • Loading...

More Telugu News