: కుంభమేళాను రాజకీయ వేదికగా మార్చకండి: సమాజ్ వాదీ పార్టీ
పవిత్ర కుంభమేళాను రాజకీయ వేదికగా మార్చుకుంటే సహించేది లేదని సమాజ్ వాదీ పార్టీ హెచ్చరిక జారీ చేసింది. కుంభమేళా పండుగను రాజకీయ వేదికగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ కుశ్వహ ఆరోపించారు. ఒకవేళ అలా చేస్తే వారిని అడ్డుకుంటామని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు అలహాబాద్ లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్నారు.
అలాగే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ 12న కుంభమేళాలో పాల్గొంటున్నారు. దీనికితోడు ఈ రోజు, రేపు కుంభమేళాలో విశ్వహిందూ పరిషత్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాదీ పార్టీ ఘాటుగా స్పందించింది. అయితే కుశ్వహ హెచ్చరికలపై బీజేపీ నేత కల్రాజ్ మిశ్రా మండిపడ్డారు. రాజ్‌నాథ్ సింగ్ పవిత్ర స్నానం కోసమే కుంభమేళాకు వెళుతున్నారని స్పష్టం చేసారు.