: దేశంలో ఖరీదైన కార్యాలయ ప్రాంతమిదే


ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ దేశంలోనే కార్యాలయాలకు సంబంధించి చాలా ఖరీదైన ప్రాంతంగా నిలిచింది. ప్రపంచంలో ఖరీదైన కార్యాలయాల ప్రాంతాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉండగా.. డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గిపోవడంతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అలాగే, ముంబైలోని బంద్ర కుర్లా ప్రాంతం కూడా దేశంలో రెండో స్థానంలో, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎనిమిదో స్థానంలో ఉంది. కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ అనే ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ ఖరీదైన కార్యాలయ ప్రాంతాలపై నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

  • Loading...

More Telugu News