: సీఎం సమైక్యవాదం తేలిపోయింది: దానం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం తేలిపోయిందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డికి నిజాయతీ, నైతిక విలువలు, సమైక్యవాదంపై గౌరవం ఉండి ఉంటే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి ఉండేవారని అన్నారు. కేంద్రం ప్యాకేజీలు ఇస్తామన్నప్పుడే వాస్తవాలు బయటపెట్టి ఉండాల్సిందన్నారు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలే సీఎం మభ్యపెట్టి, మోసం చేశారని అంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హడావుడి నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వంలో విచారణ చేయిస్తామని దానం తెలిపారు.