: గ్రామస్తులపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన కోతి
కోతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన పూర్వీకుడే అయినా, ఆంజనేయుడి అంశ అని కొందరు భావించినా, గ్రామాల్లో అతడి విధ్వంసానికి హద్దులుండవు. చెట్టెక్కితే.. పూత, పిందె సహా నేలరాలాల్సిందే. మేడపై ఆరబోసుకున్న వడియాలు గట్రా ఇతడి ధాటికి చెల్లాచెదురవ్వాల్సిందే. అంతటి ఘనతర సాధ్యుడీ కోతి. ఉత్తరప్రదేశ లోని మొరాదాబాద్ నియోజకవర్గంలో హరిసింగ్ పూర్ గ్రామంలో ఓ కోతి ఏం చేసిందో చూడండి. గ్రామంలోని స్కూల్ టీచర్ నుంచి రూ.50 వేల నోట్ల కట్టను లాగేసుకుంది. అంతటితో ఆగకుండా, కట్టలోంచి నోట్లను పీకి గ్రామస్తులపైకి విసరసాగింది. అవి ఏరుకుంటూ ఆ గ్రామస్తులు కోతి వెంట పరుగులు పెట్టారు. సుమారు రెండు గంటలపాటు స్వైర విహారం చేసిన కోతి మొత్తమ్మీద రూ.46 వేలు పందేరం చేసింది. పాపం, ఆ టీచర్ లబోదిబోమంటున్నాడు కోతి చేసిన నిర్వాకానికి!