: రాష్ట్ర విభజన తీరుపై కేజ్రీవాల్ మండిపాటు
లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీలు తమ కుమ్మక్కు రాజకీయాలను కొనసాగించాయని విమర్శించారు. లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలను ఆపి, పరస్పరం సహకరించుకుని బిల్లును ఆమోదించాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకునే బీజేపీ బిల్లుకు మద్దతిచ్చిందన్నారు. అపవిత్ర అవగాహనతో పారదర్శకతకు పాతరేసినందుకా ప్రజలు వీరికి ఓట్లు వేసింది? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.