: క్యాంపు కార్యాలయంలో సీఎంను కలుస్తున్న సీమాంద్ర నేతలు


హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. కిరణ్ ఈ రోజు రాజీనామా చేయనున్న క్రమంలో వారంతా ఆయనను పరామర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కాసేపట్లో ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. అప్పుడే కిరణ్ తన రాజీనామా లేఖను సమర్పిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News