: భౌగోళికంగా దూరమైనా.. మానసికంగా ఎవరూ విడదీయలేరు: డీఎస్
తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలు భౌగోళికంగా దూరమైనా, మానసికంగా వారిని ఎవరూ విడదీయలేరని టీకాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఈ రెండు రాష్ట్రాలు దేశంలోనే అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంత మంది ఇరు ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారని విమర్శించారు.