: మొదలైన పదో తరగతి పరీక్షల సమరం
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 12,04,201 మంది విద్యార్థులు 5646 కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నారు. ఫస్ట్ లాంగ్వెజ్ పేపర్ 1(గ్రూప్-ఎ) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. ఇధి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతుంది. అలాగే, ఫస్ట్ లాంగ్వెజ్ పేపరు 1 (కంపోజిట్) 12.30 వరకూ జరుగుతుంది. ఏప్రిల్ 9తో పదో తరగతి పరీక్షలు ముగుస్తాయి. ఈసారి కాపీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సిబ్బందికి భారీ జరిమానా విధించి జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారు.