: నేడు ముఖ్యమంత్రి రాజీనామా
ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ ఉదయం 10.45కి ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. అనంతరం గవర్నర్ ను కలసి రాజీనామాను అందజేస్తారు. ఈ క్రమంలో, ఉదయం 10.30కల్లా తన ఇంటికి రమ్మని పార్టీ నేతలకు ఇప్పటికే ఆయన సమాచారం అందించారు. నిన్ననే సీఎం రాజీనామా చేస్తారని అందరూ ఊహించారు. కానీ, అందరికీ సమాచారం అందచేసిన అనంతరమే రాజీనామా చేయాలని ఆయన భావించారని తెలుస్తోంది. సీఎం కార్యాలయం నుంచి తెలంగాణ ప్రాంత నేతలకు కూడా ఈ మేరకు ఫోన్లు వెళ్లాయి.