: నా కన్నా పెద్దాయన ఎవరున్నారు?
'ప్రపంచంలోనే అందరికంటే పెద్ద వాడిని నేనే' అంటున్నాడు మన భారతీయుడు. ఈయన పేరు ప్రేమ్ సాయి. ఈయనను కలుసుకోవాలంటే ఛత్తీస్ గఢ్ లోని కోబ్రా జిల్లా తిల్హపటాయ్ గ్రామానికి వెళ్లాలి. ఈయన వయసు 117 సంవత్సరాలట. తాను 1896 మే 11న పుట్టానని చెబుతున్నాడు. దీనికి ఆధారంగా ఆధార్ కార్డు చూపుతున్నాడు. ప్రభుత్వ రికార్డులను పరిశీలిద్దామంటే అంత వెనుకటివి లేవు మరి.
ఒకవేళ గిన్నిస్ బుక్ వారు ప్రేమ్ సాయి పుట్టిన తేదీని ధ్రువీకరిస్తే ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధుడిగా రికార్డులకు ఎక్కుతాడు. జపాన్ కు చెందిన 115 ఏళ్ల విసావో ఒకావా పేరిట ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత వృద్ధుడి రికార్డు ఉంది. ప్రేమ్ సాయి కుటుంబ సభ్యుల సంఖ్య 50. తన తండ్రి అందరిలా సాధారణ ఆహారమే తీసుకుంటారని, తన పనులు తానే చేసుకుంటారని ప్రేమ్ సాయి రెండో కొడుకు మహేశ్ తెలిపారు.