: ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సత్యారావు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ఎ.సత్యారావును నియమిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సత్యారావు రెండేళ్ల కాలానికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొనసాగుతారు. ఇంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీనియర్ జర్నలిస్టు అయిన సత్యారావు సమాచార, పౌర సంబంధాల డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.