: గంటా కార్యాలయంపై దాడి


లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోద ముద్ర పడడంతో సమైక్యవాదుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అనకాపల్లిలోని మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయంపై ఈ సాయంత్రం సమైక్యవాదులు దాడికి దిగారు. కార్యాలయం లోపలికి చొచ్చుకువెళ్ళి ఫర్నిచర్, ఫ్లెక్సీలు, బ్యానర్లను ధ్వంసం చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకీ తీసుకువచ్చారు.

  • Loading...

More Telugu News