: విభజన నిర్ణయం సరికాదు: ములాయం సింగ్
కీలకమైన ఆంధ్రప్రదేశ్ పునర్వ్వవస్థీకరణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్నప్పడు సభ నిర్వహించిన తీరు పట్ల సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చను దేశ ప్రజలు చూసేందుకు వీల్లేకుండా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడం తగదని ఆయన అన్నారు. విభజననిర్ణయం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే ఇదంతా జరిగిందని ములాయం ఆరోపించారు.