: రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి: సీపీఐ నేత నారాయణ
తెలంగాణ అప్రజాస్వామికంగా ఏర్పడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. లోక్ సభలో బిల్లుకు బీజేపీ మద్దతు పలికిందని, మరో పక్క ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు ఇది చీకటి రోజు అని వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్, బీజేపీ కలిసే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశాయని ఆయన చెప్పారు. విభజన పేరుతో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచకూడదని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిదీ అని నారాయణ స్పష్టం చేశారు.