: తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: సుష్మా స్వరాజ్


తెలంగాణ కావాలన్న చిరకాల వాంఛ ఇవాళ్టితో నెరవేరిందని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతు తెలిపామని ఆమె చెప్పారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశంపై ఐదేళ్లుగా కాలయాపన చేసిందని సుష్మా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అంశంలో ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఆమె తేల్చి చెప్పారు. బీజేపీ కారణంగానే బిల్లు పాస్ కాలేదని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేసిందని, ఇవాళ ఉదయం వరకు కాంగ్రెస్ నాటకాలాడిందని ఆమె చెప్పారు. లోక్ సభ చివరి సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టారని ఆమె అన్నారు. బీజేపీ ఆది నుంచి తెలంగాణకు అనుకూలమేనని, పదేళ్లుగా తెలంగాణ ఇస్తామని బీజేపీ చెబుతూ వస్తోందని ఆమె స్పష్టం చేశారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని సుష్మా చెప్పారు.

  • Loading...

More Telugu News