: అవినీతిపరులను కాపాడడంలో సీఎం బిజీ: బాబు ఆరోపణ


రాష్ట్రంలో పాలన గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  అవినీతి నేతలను కాపాడడంలో బిజీగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకుల అసమర్థత వల్లే ప్రజలకు కష్టాలు దాపురించాయని మండిపడ్డారు.

సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులను చూస్తే సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని బాబు విమర్శించారు. సూట్ కేసులకు అమ్ముడుపోయే నాయకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు. ఇక వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికైనా కాంగ్రెస్ లో కలవడం ఖాయమని చెప్పారు.  

  • Loading...

More Telugu News