: వెల్ లో ఐదు రాష్ట్రాల ఎంపీలు
తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆమోదింపజేసింది. లోక్ సభలో తెలంగాణ బిల్లుపై చర్చ అనగానే సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు, బీజేడీ, శివసేన, సీపీఎం, ఏఐఏడీఎంకే, తృణముల్ కాంగ్రెస్, ఎస్పీ పార్టీలకు చెందిన ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్ద ఆందోళన తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించడం విశేషం. కాగా కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా జేడీయూ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి.