: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: సుజనాచౌదరి
దేశ రాజకీయాల్లోనే నేడు అత్యంత దుర్దినమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. సగం మంది సభ్యులు వెల్ లోనే ఉండగా విభజన ఎలా చేస్తారని అన్నారు. దేశ ప్రజలను అంధకారంలో ఉంచి, సోనియా గాంధీ నేతృత్వంలో స్పీకర్ మీరా కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని అన్నారు. సీమాంధ్ర ఎంపీలను విచక్షణాధికారాలతో సస్పెండ్ చేస్తే, ఈ రోజు లోక్ సభలో సగం మంది సభ్యులు వెల్ లో ఆందోళనలు చేశారని అన్నారు.