: ఐదున్నర కోట్ల మంది ప్రజల ఉసురు తగులుతుంది: శివప్రసాద్


ఐదున్నర కోట్ల మందికి అన్యాయం చేసిన ప్రజాప్రతినిధులంతా మట్టిగొట్టుకుపోతారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ చిదంబరంగాడెవడు?, జైరాం రమేష్ గాడెవడు?, షిండేగాడెవడు, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి? అంటూ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు లేకుండా రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాము చేసిన నిస్వార్థ పోరాటం వృథా అవుతోందని ఆయన అన్నారు. సిగ్గులేని పాలకులు ఐదున్నర కోట్ల మంది ప్రజల గొంతులు కోశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News