: 'ప్రతిభ+సమాచారసాంకేతికత =భారతదేశ భవిష్యత్తు'
భారత దేశంలో ప్రతిభకు కొదవలేదని, దానికి సమాచార సాంకేతికత జోడిస్తే భారతదేశ భవిష్యత్తు ఆవిష్కృతమవుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఇంటర్ నెట్ సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇంటర్ నెట్ ను 'సమాజానికి చుక్కాని'గా అభివర్ణించారు.
ఇంటర్ నెట్ తో సామాన్యులు సైతం సిద్దాంతాల రూపకల్పనలో పాలు పంచుకోవచ్చని, పాలనలో పారదర్శకతకు ఇదో అద్భుతమైన సాధనమని మోడీ వివరించారు. ఇంటర్ నెట్ తో ప్రజలు శక్తిమంతులు అవుతారని, నాయకులతోనూ, ప్రభుత్వంతోనూ నిరంతరం సంబంధాలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.