: లోక్ సభలో షిండేకి ఒవైసీ ఝలక్!


ఈ రోజు లోక్ సభలో ఊహించని పరిణామం సంభవించింది. వాయిదా అనంతరం సభ ప్రారంభమయిన వెంటనే హోంమంత్రి మాట్లాడడానికి ఉపక్రమించారు. ఈ సమయంలో కొంత మంది ఎంపీలు ఆయన చుట్టూ భద్రతా వలయంలా ఏర్పడ్డారు. ఇదే సమయంలో తన సీటు వైపు వెళ్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ షిండేను ఎద్దేవా చేశారు. 'హోంమంత్రిగా ఉన్నారు అంత భయమైతే ఎలా? సభలో కూడా ఇతర ఎంపీల భద్రత కావాలా?' అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా, 'నేను వచ్చి మిమ్మల్ని కాపాడాలా?' అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.

  • Loading...

More Telugu News