: కీరవాణి ఫ్యామిలీకి విశాఖతో లింకు!


ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబానికి విశాఖతో ఓ ఆసక్తికరమైన అనుబంధం ఉంది. కీరవాణి పుట్టింది విశాఖలోనేనట. ఇక ఆయన సహధర్మచారిణి శ్రీవల్లితో తొలి పరిచయానికి వేదిక కూడా విశాఖే. అంతేనా, కీరవాణి-వల్లి దంపతులకు ఇద్దరబ్బాయిలన్న సంగతి తెలిసిందే కదూ.  అయితే, వారిద్దరు పుట్టిందీ విశాఖలోనే కావడం విశేషం.

ఈ విషయాలన్నీ స్వయంగా కీరవాణే చెప్పాడు. విశాఖలో ఈరోజు జరుగుతున్న 'ఇంటింటా అన్నమయ్య' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు సభికులతో పంచుకున్నాడు. కాగా, ఈ సందర్భంగా తన గురువు నేదునూరి కృష్ణ మూర్తిని కీరవాణి ఘనంగా సత్కరించారు. 

  • Loading...

More Telugu News