: పొన్నాల ప్రారంభించిన ఆ వెబ్ సైట్.. పనిచేయడం లేదు!


రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆర్భాటంగా ప్రారంభించిన ఆ వైబ్ సైట్ తెరుచుకోవడం లేదు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజనోత్సవంగా పేరొందిన మేడారం మహా జాతరపై ఆయన ఆవిష్కరించిన వెబ్ సైట్ ఒక్క రోజు కూడా పనిచేయలేదు. ఈ నెల 11న పొన్నాల హైదరాబాదులో సమ్మక్క-సారలమ్మ వెబ్ సైట్ ను www.sammakkasarakka.co.in పేరుతో అధికారికంగా ప్రారంభించారు. సమ్మక్క-సారలమ్మ విశిష్టితను తెలిపే అంశాలు, ప్రభుత్వపరంగా జాతర నిర్వహణ ఏర్పాట్లు, అత్యవసర ఫోన్ నెంబర్లు, గిరిజన వన దేవతల దర్శనార్థం వచ్చే భక్తులకు అవసరమైన సమాచారం, గూగుల్ రూట్ మ్యాప్ లను ఈ పోర్టల్ లో పొందుపరిచినట్లు పొన్నాల చెప్పారు.

రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ విదేశాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సమస్త సమాచారం సైట్ లో ఉందని ప్రారంభోత్సవం నాడు పొన్నాల ప్రకటించేశారు. జాతరకు వెళ్లిన భక్తులు మేడారం వివరాల కోసం.. మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ లో వెతికితే.. ఆ వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. నాలుగు రోజులు జరిగిన జాతరలో కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న విషయం విదితమే. మహా జాతర ముగిశాక, ఇప్పటికీ ఈ సైట్ నెటిజన్లకు అందుబాటులోకి రాలేదు.

  • Loading...

More Telugu News