: సోనియా తీవ్ర అసంతృప్తి
ఈరోజు పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలపై యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీపీఎం, ఎస్పీ, ఏఐఏడీఎంకే, బీజేడీ ఎంపీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంశం సభకు వచ్చిన సందర్భంలో ఆ పార్టీల ఎంపీలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించడం సోనియా ఆగ్రహానికి కారణమైంది. దీంతో, ఆయా పార్టీల అగ్రనేతలతో చర్చించాలని కమల్ నాథ్ ను ఆదేశించారు.