: రాహుల్ గాంధీ, ఏం సమాధానం చెబుతావు?: మోడీ


పేదరికం అంటే మనకు మానసిక ఆందోళన అని, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పేదరికం అంటే దౌర్భాగ్యం అని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే ధరలు తగ్గించి, మహిళల కడుపునిండా భోజనం పెట్టే అవకాశం కల్పించాలని మోడీ కోరారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని మోడీ ప్రశ్నించారు. ఈ రోజు కర్ణాటకలోని దావణగెరెలో జరిగిన సభలో మోడీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరంతరం మహిళల గురించి మాట్లాడే రాహుల్ గాంధీకి ఢిల్లీలో జరుగుతున్న అత్యాచారాలు కనబడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్ లో ఆ పార్టీ నేతలే అత్యాచారం కేసుల్లో ఇరుక్కున్నారని, వాటికి ఏమని సమాధానం చెబుతారని మోడీ ప్రశ్నించారు. మహిళా రక్షణకు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్య చేపట్టలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిజాలు చెప్పే అలవాటు చేసుకోవాలని మోడీ సూచించారు.

  • Loading...

More Telugu News