: ఆటంకాలు స్పీకర్ తొలగిస్తారు..బిల్లు ఆమోదం పొందుతుంది: షిండే


తెలంగాణ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ లోక్ సభలో తెలంగాణ బిల్లు చర్చలో ఏర్పడే ఆటంకాలను స్పీకర్ తొలగిస్తారని అన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించేవారు, వ్యతిరేకించేవారు ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయం వెల్లడించే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ బిల్లుపై ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News