: ఏపీ విభజనకు మేము వ్యతిరేకం: సమాజ్ వాదీ పార్టీ
ఆంధ్రప్రదేశ్ విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకమని సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. రాష్ట్రాల విభజనతో కొత్త సమస్యలు వస్తాయన్న మాటకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు తాము వ్యతిరేకమని, సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపారు.