: తెలంగాణ బిల్లుకు మద్దతిస్తాం: మాయావతి
తెలంగాణ బిల్లుకు ఉభయసభల్లోను మద్దతు ఇస్తామని బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలు చేయాలంటూ అసెంబ్లీలో బిల్ పాస్ చేశామని... కాబట్టి యూపీని కూడా విభజించాలని కోరారు. అలాగే, ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న మహరాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలని అన్నారు.