: తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన షిండే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్ సభలో ప్రవేశ పెట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు తీవ్ర నిరసనలు తెలుపుతుండగా, వారికితోడు తమిళనాడుకు చెందిన ఎంపీలు శ్రీలంకలో చిక్కుకుపోయిన జాలర్ల రక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. దీంతో లోక్ సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు.