: తెలంగాణ వాదుల బెయిల్ పిటిషన్ తిరస్కరణ
సడక్ బంద్ కార్యక్రమంలో అరెస్టయిన తెలంగాణ ఐకాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులకు ఏప్రిల్ 4వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, కోదండరాం పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై విచారణను శనివారానికి వాయిదా వేసింది.
ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై సడక్ బంద్ నిర్వహించడంతో, వీరిని అదుపులోకి తీసుకున్నారు. మానవపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ రేంజి డీఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసులో కోదండరాంతో పాటు ఈటెల, జూపల్లి, రాజేందర్ గౌడ్ తదితరులు అరెస్టయ్యారు.