: డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కు సీమాంధ్ర టీడీపీ ఎంపీల వినూత్న నిరసన
రాజ్యసభలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు స్పీకర్ పోడియం వరకు దూసుకెళ్లి నిరసనలు తెలిపిన సీమాంధ్ర టీడీపీ ఎంపీలు తాజాగా మరింత దూకుడైన వ్యవహార శైలిని అనుసరించారు. సీమాంధ్ర ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు రాజ్యసభ కార్యదర్శి వెనక్కి వెళ్లి తమ నినాదాలు కొనసాగించారు. దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కురియన్ ను చుట్టుముట్టే ప్రయత్నంలో వారంతా అక్కడ చేరారు. మార్షల్స్ ఉండడంతో డిప్యూటి ఛైర్మన్ స్థానం వరకు చేరుకోలేకపోయారు.