: నేపాల్ కు అఖిలేశ్ యాదవ్


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల పర్యటన కోసం సోమవారం రాత్రి నేపాల్ కు వెళ్లారు. ఆయన వెంట ప్రజాపనుల శాఖ మంత్రి శివ్ పాల్ సింగ్ యాదవ్ సహా పలువురు ఉన్నారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్, కొత్త ప్రధాని సుశీల్ కోయిరాలాతో భేటీ అవుతారని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు అంశాలపై వారితో చర్చలు జరుపుతారని వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్ కు నేపాల్ తో 500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

  • Loading...

More Telugu News