: పాప.. బాబు.. అమ్మ పాలు వేరయా
అమ్మ కడుపులోంచి 9 నెలల తర్వాత భూమిపైకి ప్రవేశిస్తాం. అమ్మపాలతో, ప్రేమతో మురిపెంగా పెరుగుతాం. అయితే, పుట్టే బిడ్డను బట్టి అమ్మ చనుపాలలోనూ తేడాలుండవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయమై హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ కేటీ హిండే రీసస్ కోతులపై పరిశోధన చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఆ కోతుల్లో మగ పిల్లలు పుట్టినప్పుడు వాటి పాలలో 35 శాతం అదనంగా ఫాట్, ప్రొటీన్ ఉన్నట్లు చెప్పారు. అదే ఆడ పిల్లలు పుట్టినప్పుడు తయారయ్యే పాలలో తక్కువ ఫాట్, కాల్షియం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఆడ పిల్లలు పుట్టినప్పుడు ఎక్కువ పాలు తయారవుతాయని వివరించారు. ఆడ, మగ పిల్లల్లో శారీరక నిర్మాణం, ఎదుగుదల వేర్వేరుగా ఉంటుంది కనుక.. అమ్మ పాలలోనూ మార్పు ఉండవచ్చని హిండే అన్నారు.