: మూజువాణి ఓటుతో గట్టెంక్కించాలనే యోచనలో హైకమాండ్
అత్యంత క్లిష్టమైన రాష్ట్ర విభజన బిల్లు ఈ రోజు లోక్ సభలో చర్చకు రానుండటంతో పార్లమెంటులో వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బిల్లులోని లోపాలను సాకుగా చూపి యూపీఏను ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే బిల్లును గట్టెక్కించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం క్లిష్టమైతే, మూజువాణి ఓటుతోనైనా బిల్లును గట్టెక్కించాలని కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. ఇదే ప్రణాళికతో మన రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును తిరస్కరించి పంపిన సంగతి తెలిసిందే.