: సొంత వర్గం ఏర్పాటులో బొత్స.. ఢిల్లీలో హైకమాండ్ కు దగ్గరయ్యే ప్రయత్నం


రాష్ట్ర వ్యవహారాలు జెట్ వేగంతో మారుతున్న నేపథ్యంలో, సీమాంధ్ర కాంగ్రెస్ లో వర్గ రాజకీయాలకు తెరలేచింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో అనేక మంది సీఎం కిరణ్ కు అండగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్న పీసీసీ చీఫ్ బొత్స ఇప్పుడు తన వర్గం తయారు చేసుకునే పనిలో పడ్డారు. సీఎం కిరణ్ అధిష్ఠానానికి వ్యతిరేకి అనే ముద్ర వేసుకున్న నేపథ్యంలో, తాను మాత్రం హైకమాండ్ కు విధేయుడ్ని అనిపించుకునే పనిలో బొత్స ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ కు దగ్గరయ్యే ప్రయత్నాలను ఆయన మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బొత్స వర్గంలో రఘువీరారెడ్డి, ఆనం, డొక్కా, రామచంద్రయ్య, కన్నా లక్ష్మినారాయణ, బాలరాజు తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News