: నేడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈ రోజు చర్చ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లోక్ సభ సభావ్యవహారాల అజెండాలో 41 వ అంశంగా దీనిని చేర్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చ చేపట్టి సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ పెట్టి ఆమోదం పొందాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒకరోజు లోక్ సభలో, మరో రోజు రాజ్యసభలో చర్చ చేపట్టి రాష్ట్ర విభజనను పూర్తి చేయాలని నిర్ణయించింది.