: 'క్రికెటర్ ఆఫ్ ద జనరేషన్' అవార్డు రేసులో క్రికెట్ దేవుడు


భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో అవార్డు రేసులో నిలిచాడు. 'క్రికెటర్ ఆఫ్ ద జనరేషన్' అవార్డు కోసం సచిన్ పేరు నామినేట్ అయింది. ఈఎస్పీఎన్ క్రికిన్ఫో వెబ్ సైట్ అందించే ఈ అవార్డు కోసం సచిన్ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ కూడా రేసులో ఉన్నాడు. వీరిద్దరే కాకుండా బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీధరన్, జాక్వెస్ కలిస్, షేన్ వార్న్ కూడా నామినేట్ అయ్యారు. ఈఎస్పీఎన్ క్రికిన్ఫో 20వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ అవార్డు విజేతను ప్రకటిస్తారు. ప్రపంచ క్రికెట్లో తమదైన ముద్ర వేసిన క్రికెటర్లను ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు.

  • Loading...

More Telugu News