: ఐపీఎల్ యూరప్ ప్రసార హక్కులు చేజిక్కించుకున్న 'బి స్కై బి'


ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాసుల వర్షం కురిపించే ఈ లీగ్ ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉంటుంది. తాజాగా, ఈ లీగ్ ను యూరప్ లో ప్రసారం చేసేందుకు 'బి స్కై బి' బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి హక్కులు కేటాయించారు. ఈ ఒప్పందం ద్వారా యూరప్ లో ఐపీఎల్ 2015-17 సీజన్లకు సంబంధించి టీవీలు, ఇంటర్ నెట్, మొబైల్ ప్రసార హక్కులన్నీ ఈ బ్రిటిష్ కంపెనీకి చెందుతాయి. ఈ మేరకు ఐపీఎల్ పాలకమండలి నిర్ణయం తీసుకుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News