: ధోనీ సహనం కోల్పోయిన వేళ..


మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ జార్ఖండ్ ఆణిముత్యం ప్రత్యేకత ఏమిటని అడిగితే ఎవరైనా చెప్పేది ఒక్కటే. స్థితప్రజ్ఞత! ఒత్తిడి సమయంలో సైతం ప్రశాంతంగా ఉండడం, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం వంటి లక్షణాలు ధోనీ కెప్టెన్సీకి వన్నెతెచ్చాయి. కానీ, న్యూజిలాండ్ తో రెండో టెస్టులో పరిణామాలు కెప్టెన్ కూల్ కి సైతం చిరాకు తెప్పించాయి. నాలుగో రోజు ఆటలో రోజంతా బౌలింగ్ చేసి ఒక్క వికెట్టే తీయడంపై ధోనీ ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఓ దశలో రాంగ్ లైన్ లో బంతులు విసురుతున్న బౌలర్ రవీంద్ర జడేజాకు చురకలంటించాడు.

తాను షార్ట్ పొజిషన్ లో పుజారాను ఫీల్డింగ్ కు పెట్టింది చప్పట్లు కొట్టేందుకు కాదని జడేజాకు స్పష్టం చేశాడు. దానర్థం పుజారా వద్దకు క్యాచ్ లు వేళ్ళే విధంగా బంతులు విసరాలన్నది ధోనీ అభిప్రాయం. 'పుజారా కో వహా తాలీ బజానే కేలియే నహీ రఖా!' అని ధోనీ అనడం స్టంప్ మైక్రోఫోన్ ద్వారా స్పష్టంగా వినపడింది. ఇక, తొలి ఇన్నింగ్స్ లో వికెట్ల పండగ చేసుకున్న ఇషాంత్ రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్టూ తీలేకపోయాడు. తన బౌలింగ్ ను ఊచకోత కోసిన కివీస్ కెప్టెన్ మెకల్లమ్ ను ఇషాంత్ దూషించడం కూడా మైక్రోఫోన్ ద్వారా వినిపించింది.

  • Loading...

More Telugu News