: కొత్త పార్టీకి స్క్రీన్ ప్లే సోనియానే: గాలి


సీఎం కిరణ్ కొత్త పార్టీకి స్క్రీన్ ప్లే అంతా సోనియాదే అని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. గతంలో ఏపీఎన్జీవోలు సమ్మె విరమించుకోవడానికి కారణం కూడా కిరణే అని... మరి కొన్ని రోజులు సమ్మె కొనసాగి ఉంటే సదరన్ గ్రిడ్ ఫెయిలై... దక్షిణాది అంతా చీకటిలో మగ్గిపోయేదని... దెబ్బకు కేంద్రం దిగి వచ్చేదని చెప్పారు. సీఎం పెట్టే పెట్టే పార్టీ మరో పీఆర్పీ అవుతుందని జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంటులో టీబిల్లును మూజువాణి ఓటుతో ఆమోదింప చేసుకోవచ్చనే ఆలోచనకు ప్రేరణ కూడా కిరణే అని విమర్శించారు. రాష్ట్ర విభజన అంశంలో బీజేపీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ రోజు చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్టే అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News