: విపక్షాల సహకారం కోరిన రాహుల్
పార్లమెంటు సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కానీ, సభ ఆమోదం పొందాల్సిన బిల్లులు మాత్రం చాలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దీంతో, కాంగ్రెస్ యువరాజు రంగంలోకి దిగారు. బిల్లులను ఏకాభిప్రాయంతో ఆమోదింపజేసుకోవడానికి ఒక తేదీని నిర్ణయించండంటూ విపక్షాలను కోరారు. అయితే, ఆయన విజ్ఞప్తికి విపక్షాలు పెద్దగా స్పందించలేదని సమాచారం.