: విభజనపై దాఖలైన మూడు పిటిషన్లు తిరస్కరణ
రాష్ట విభజనపై దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు మళ్లీ తిరస్కరించింది. బిల్లు లోక్ సభ పరిధిలో ఉండగా ఎలా జోక్యం చేసుకుంటామని జస్టిస్ దత్తు వ్యాఖ్యానించారు. సరైన సమయంలో మళ్లీ పిటిషన్లు వేయాలని కోర్టు సూచించింది. గతంలో సీనియర్ న్యాయవాదులు వాదించినప్పుడు కూడా ఇదే సమాధానం ఇచ్చామని కోర్టు పేర్కొంది.